కరోనా సమస్యకు కేబినెట్‌ భేటీలో ప్రాధాన్యం లేదు

Published: Friday May 07, 2021

కేంద్రం ఇస్తున్నవి గాక రాష్ట్రం సొంతగా కొనుగోలు చేయడానికి కేవలం 13.5లక్షల వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వాలని, దీనికి రూ.45 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకొంది. పొరుగున ఉన్న కేరళ కోటి వ్యాక్సిన్లు, తమిళనాడు కోటిన్నర, కర్ణాటక కోటి, మహారాష్ట్ర మొత్తం జనాభాకు సరిపోయేంత వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వాలని నిర్ణయించి వనరులు సిద్ధం చేసుకొన్నాయి. మన రాష్ట్రంలో 13 లక్షల టీకాలు ఏ మూలకు వస్తాయి? మొత్తం వనరులన్నీ పోగుచేసి రాష్ట్రంలో ప్రజలందరికీ చాలినన్ని వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వలేరా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తమ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం ఆయన బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు. కరోనా విలయంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉంటే కేబినెట్‌ భేటీలో 33à°µ అంశంగా కరోనా అంశాన్ని చర్చకు తీసుకొన్నారని, అన్నీ అయిపోయిన తర్వాత చివర్లో దీన్ని పెట్టారని ఆయన ఆక్షేపించారు. ‘ప్రభుత్వానికి ఇతర పనులు ఉండవచ్చు. కానీ ప్రజల ప్రాణాలు కాపాడటం అన్నిటికంటే అత్యవసరం. ప్రభుత్వం పెట్టిన డ్యాష్‌ బోర్డులో పడకలు, వెంటిలేటర్లు ఎన్ని ఖాళీలున్నాయో కచ్చితమైన సమాచారం ఉండటం లేదు. 

ఆక్సిజన్‌ సరఫరాను పట్టించుకోక అనంతపురం, కర్నూలు, హిందూపురం, విజయనగరం, నెల్లూరు తదితర చోట్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. రాబోయే రోజుల్లో ఆక్సిజన్‌ అవసరం రోజుకు వెయ్యి టన్నులకు పెరగవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైద్యులు, నర్సులకు విరామం ఇవ్వకుండా ఊపిరి సలపనంత పనిలో పెడుతున్నారు. వారు పడిపోతే మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది. కొత్త నియామకాలు ఇప్పుడు మొదలుపెడుతున్నారు. గతంలో పనిచేసిన వైద్య సిబ్బందికి జీతాల బకాయిలు ఇవ్వలేకపోయారు. నిర్దిష్ట విధానం రూపొందించక పోవడం వల్ల రెమిడెసివర్‌ ఇంజెక్షన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయి కొరత వచ్చింది. వలంటీర్లు చేతిలో ఉన్నా సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోతున్నారు. తక్కువ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారు ఇంట్లోనే చికిత్స తీసుకొనేలా మందులు ఇస్తే ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గేది. మా ప్రభుత్వం ఉండగా 2వేల మందితో కాల్‌సెంటర్‌ నిర్వహించాం. ప్రతి సమాచారం చేతిలో ఉండేలా ఆర్‌టీజీ వ్యవస్ధ రూపొందించాం. దానిని కొనసాగించి ఉంటే టెలిమెడిసిన్‌ ద్వారా వేల మందికి చికిత్స ఇవ్వగలిగే అవకాశం ఉండేది. కాని వాటినిపక్కన పెట్టారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 

కరోనా వ్యాప్తిని ఆపడానికి లాక్‌డౌన్‌ ఒకటే పరిష్కారమని చంద్రబాబు ప్రతిపాదించారు. ‘ఎన్‌ 440కె అనే మార్పుచెందిన కరోనా వైరస్‌ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉధృతంగా ఉంది. దానివల్లే వ్యాప్తి బాగా అధికంగా ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. దాన్ని తొలిసారి కర్నూలులో కనుగొన్నారని చెబుతున్నారు. తెలంగాణ హైకోర్టులో కూడా à°ˆ వైర్‌సపై చర్చ జరిగింది. ఇప్పుడు అది దేశం మొత్తం వ్యాపిస్తోంది. ఉదయం 6à°—à°‚à°Ÿà°² నుంచే మద్యం షాపులు, బార్లు తెరుస్తున్నారు. అవి à°…à°‚à°¤ అవసరమా? సీఎం బాధ్యత తీసుకోవాలి. తనకు తెలియకపోతే నిపుణులను కూర్చోపెట్టుకొని వారి సలహాలు తీసుకోవాలి. లాక్‌డౌన్‌పై త్వరితంగా నిర్ణయం తీసుకోండి. ఎన్ని వందల కోట్లు అయినా ప్రజలందరికీ వ్యాక్సిన్లు అందడానికి నిధులు సమీకరించుకోండి. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ఇవ్వాలి. పేదలకు మందులు ఉచితంగా ఇవ్వాలి. కరోనా కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోకుండా అదుపు చేయాలి. పంటలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి’ అని ఆయన సూచించారు. 

 

అమెరికాలో ఉండి కరోనాపై పట్టుసాధించిన తెలుగు వైద్యుడు లోకేశ్వరరావు సాయంతో టీడీపీ కార్యాలయాల్లో  వైరస్‌ సోకినవారికి ఆన్‌లైన్‌లో వైద్య సలహాలు ఇప్పించడం ద్వారా 195మందిని కాపాడుకోగలిగామని చంద్రబాబు చెప్పా రు. వీరిలో ఎక్కువమంది ఇంటివద్దనే ఉండి మందులు వాడి కోలుకున్నారన్నారు. ఆన్‌లైన్‌ వైద్య సలహాల ద్వారా మరింత మందికి ఇంటి వద్దే చికిత్స ఇప్పించడంపై కసరత్తు జరుగుతోందని, దీనికి సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. à°’à°• బాధితుడికి ఇంటివద్ద మందులకు రూ. 3నుంచి 4వేల ఖర్చు అవుతుందని అంచనా వేశామని, దాతలు ముగ్గురు లేక నలుగురి ఖర్చు భరించినా చాలామంది పేదలకు సాయం చేయవచ్చని వివరించారు.