గంగవరం పోర్టుపై సరికొత్త ప్రశ్నలు

Published: Tuesday June 08, 2021

గంగవరం పోర్టు డీల్‌ నిండా గందరగోళమే! à°ˆ పోర్టును ఇతరులకు విక్రయించడమే చెల్లదని... 30 ఏళ్ల తర్వాత రాష్ట్రానికే చెందాలని నిపుణులు చెబుతున్నారు. పోర్టు నిర్మాణానికి 2002లో కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ... భూములు అప్పగించడంలో జాప్యం జరిగింది. గంగవరం, దిబ్బపాలెం పరిసరాల్లోని మత్స్యకారులు భూమిని ఇవ్వడానికి అంగీకరించలేదు. 2006లోరాష్ట్ర ప్రభుత్వం భారీగా బలగాలను దించి... కాల్పులు జరిపి మరీ భూసేకరణ పూర్తి చేసింది. 2007లో పోర్టుకు భూములు అప్పగించారు. అంటే.. ఇప్పటికి 14 సంవత్సరాలు గడిచాయి. ఇంకో 16 ఏళ్లు ఆగితే బీవోవోటీ ఒప్పందం  ప్రకారం పోర్టును ప్రభుత్వానికి వదిలేసి డీవీఎస్‌ రాజు వెళ్లిపోవాలి. అప్పుడే మొత్తం 100 శాతం వాటా ప్రభుత్వానికే వస్తుంది. కానీ... ఈలోపే మొత్తం గంగవరం పోర్టు అదానీ పోర్ట్స్‌, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీ సెజ్‌) ఖాతాలో చేరిపోయింది. గంగవరం రేవులో డీవీఎస్‌ రాజు తన వాటాగా వచ్చిన 58.1 శాతం వాటాను అదానీ గ్రూపు(ఏపీ సెజ్‌)నకు మార్చి నెలలో రూ.3,604 కోట్లకు విక్రయించారు. ఇదే పోర్టులో 31.5 శాతం వాటా ఉన్న దుబాయ్‌ కంపెనీ కూడా రూ.1,954 కోట్లకు తన వాటా విక్రయించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా వచ్చిన 10.39 శాతాన్ని కేవలం రూ.645 కోట్లకు ఇచ్చేయడానికి అంగీకరించింది. దీనికి ఆమోదముద్ర వేయడానికి ఉన్నతాధికారులతో కమిటీ కూడా వేసింది. 

 

ఎవరికో చెందిన ఇల్లు, లేదా స్థలాన్ని లీజుకు తీసుకుని... దానిని ఇంకెవరికో అమ్మడం కుదురుతుందా? ఎంతమాత్రం కుదరదు! గంగవరం పోర్టుకు కూడా ఇదే వర్తిస్తుంది. గంగవరం పోర్టుకు ప్రభుత్వం సుమారు 1,800 ఎకరాలను ‘లీజు’కు మాత్రమే ఇచ్చింది. అది కూడా తనకూ వాటా ఉంది (జాయింట్‌ వెంచర్‌). అలాంటి సంస్థలో వాటాను à°’à°•à°°à°¿à°•à°¿ తెలియకుండా మరొకరు అమ్మేసుకోవడం కుదరదు. అయినా సరే... గంగవరం పోర్టులో వాటాలను దుబాయ్‌ కంపెనీ, డీవీఎస్‌ రాజు గ్రూపు నుంచి అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా గంగవరం పోర్టును ఏపీసెజ్‌లో కలిపేందుకు అంగీకరించింది. అంటే... మరో 16 ఏళ్ల తర్వాత పూర్తిగా తనకు దక్కాల్సిన పోర్టును తానే వదులుకుందన్న మాట! దీనికి సంబంధించిన జీవోలో, ‘మిగిలిన కాలానికి పాత ఒప్పందంలోని అంశాలన్నీ యథాతథంగా వర్తిస్తాయి’ అని తెలిపారు. à°† తర్వాత ఏం జరుగుతుందన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. బీవోటీ గురించిన ప్రస్తావన ఏదీ చేయలేదు. జాయింట్‌ వెంచర్‌లో భాగంగా ప్రభుత్వం కూడా గంగవరం పోర్టులో ఉంటేనే దానిపై హక్కు ఉంటుంది. కానీ... ఇప్పుడు తన వాటాను కూడా విక్రయించేందుకు సిద్ధమైంది. దీనిపై అధికారులతో à°’à°• కమిటీని నియమించింది. అధికారుల కమిటీ ‘బీవోటీ’పై స్పష్టత ఇస్తేనే గంగవరం పోర్టుపై ఆశలు మిగులుతాయి. లేదంటే... గల్లంతే!

 

గంగవరం పోర్టు ఏర్పాటు వెనుక చాలా à°•à°¥ ఉంది. నిజానికి... ఇది ప్రభుత్వ పోర్టుగా తెరపైకి వచ్చింది. తర్వాత... ‘ప్రైవేటు’à°—à°¾ మారింది. దీని ఏర్పాటుకు నాడు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. విశాఖపట్నం రక్షణపరంగా అత్యంత కీలకమైన నగరం. తూర్పు నౌకాదళానికి ఇదే ప్రధాన స్థావరం. à°ˆ నేపథ్యంలో గంగవరం పోర్టు ఏర్పాటుకు రక్షణ శాఖ అంగీకరించలేదు. రక్షణపరంగా వ్యూహాత్మక తీరంలో ప్రైవేటు పోర్టు పెట్టడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో అక్కడ ఏం జరుగుతుందో, ఎవరికి బాధ్యత ఉంటుందో తెలియదని పేర్కొంది. దీంతో... అప్పుడు సీఎంగా ఉన్న వైఎస్‌ రాజశేఖర రెడ్డి కేంద్రంలో తనకున్న పరపతి మొత్తం ఉపయోగించారు. గంగవరం పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వమే భూములు ఇస్తోందని, అందులో భాగస్వామి (జాయింట్‌ వెంచర్‌)à°—à°¾ ఉంటుందని తెలిపారు. అందువల్ల రక్షణ పరంగా సమస్యలేవీ రావని స్పష్టమైన హామీ ఇచ్చారు. ‘జాయింట్‌ వెంచర్‌’కు సంబంధించిన పత్రాలు ఇచ్చిన తర్వాతే 2002లో కేంద్రం పోర్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు గంగవరం పోర్టు నుంచి రాష్ట్రం తప్పుకొనేందుకు సిద్ధమైంది. అది పూర్తి ప్రైవేటుగా మారిపోతోంది. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకు వ్యతిరేకం. అందువల్ల... కేంద్రం గంగవరం పోర్టు విక్రయం చెల్లదనే అవకాశమూ ఉంటుందని చెబుతున్నారు.