ఇక నుంచి డిగ్రీలో తెలుగు మీడియం బంద్

Published: Tuesday June 15, 2021

 ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి డిగ్రీలో తెలుగు మీడియంలో విద్యా బోధన నిలిచిపోనుంది. ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ విద్యా బోధన చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషులోనే కోర్సులు నిర్వహిస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో 65వేల మంది విద్యార్ధులపై  ప్రభావం పడుతుంది. ఉన్నత విద్యాపై సీఎం సమీక్షలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.