పరిషత్‌ ఎన్నికల రద్దు అప్పీల్‌పై హైకోర్టు ఆదేశం

Published: Saturday June 26, 2021

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) దాఖలు చేసిన à°… ప్పీల్‌ పై నిర్ణయాన్ని వెల్లడించేవరకు ఓట్ల లె క్కింపు, ఫలితాల ప్రకటన వద్దని హైకోర్టు తేల్చిచెప్పింది. పరిషత్‌ ఎన్నికలపై తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలం టూ మే 21à°¨ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. అప్పీల్‌లో ప్రతివాదులుగా ఉన్న జనసేన కార్యదర్శి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్‌ శా à°– ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌కు నోటీసులు జారీ చే సింది. à°ˆ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌ జయసూర్యతో కూ à°¡à°¿à°¨ ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. à°ˆ ఏడాది ఏప్రిల్‌ 8à°¨ జరిగిన జడ్పీటీసీ, à°Žà°‚ పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ మే 21à°¨ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఎ్‌సఈసీ నీలం సా హ్ని అప్పీల్‌ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది ఎస్‌.నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపి స్తూ... ‘‘టీడీపీ నేత వర్లరామయ్య, జనసేన పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యా ల్లో సింగిల్‌ జడ్జి సంయుక్తంగా తీర్పు ఇచ్చారు. జనసేన పార్టీ ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి నిర్వహించాలని కోరింది. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల మందు ఎన్నికల కోడ్‌ విధించలేదని జనసేన పేర్కొనలేదు. ఎన్నికల తేదీకి నాలుగువారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల కు విరుద్ధంగా ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారని వర్ల రామయ్య మాత్రమే అభ్యంతరం లేవనెత్తారు. టీడీ పీ నేత వ్యాజ్యాన్ని తోసిపుచ్చిన సింగిల్‌ జడ్జి, జనసేన వ్యాజ్యం లో తీర్పునిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా ఎన్నికల తేదీకి 4వారాల ముందు కోడ్‌ విధించలేదనే కారణంతో ఎన్నికలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తీర్పు వెల్లడిలో సింగిల్‌ జడ్జి పొరబడ్డారు. 

 

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక  న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు’’అని వాదించారు. జనసేన తరఫు న్యాయవాది వేణుగోపాలరావు వాదనలు వినిపిస్తూ...‘‘పోలింగ్‌కు 4వారాల ముందు కోడ్‌ విధించాలన్న సు ప్రీంకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి నోటిఫికేషన్‌ ఇచ్చా రు. ఇదే విషయాన్ని సింగిల్‌ జడ్జి దృష్టికి తీసుకెళ్లాం. à°ˆ నేపధ్యంలో సు ప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఉందని సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు’’అని వాదించారు. ధర్మాసనం స్పందిస్తూ...à°ˆ వ్యవహారంపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ..‘‘ఇప్పటికే ఎన్నికలు నిర్వహించి, బ్యాలెట్‌ బాక్సులు స్ట్రాంగ్‌ రూమ్‌లో భధ్రపరిచాం. à°ˆ నేపధ్యంలో వ్యాజ్యంపై సాధ్యమైనం à°¤ త్వరగా విచారణ జరపగలరు’’అని  కోరారు. ఆగస్టు మొదటి వారంలో అప్పీల్‌పై విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొనగా, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన బ్యాలెట్‌ బాక్సుల కోసం ఆయా రాష్ట్రాల నుంచి ఒత్తిడి ఉందని...జూలై తొలి వారంలో చేపట్టాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది కోరారు. ధర్మాసనం స్పందిస్తూ... ప్రస్తుతం ఎన్నికలు ఏమీ లేవు కదా అని వ్యాఖ్యానించింది. జూలై తొలి వారంలో సాధ్యపడదంటూ.. విచారణను జూలై 27à°•à°¿ వాయిదా వేసింది.