‘భారం’ అంటున్న జేపీ పవర్‌.. పొరపాటంతా రాష్ట్ర ప్రభుత్వానిదే

Published: Tuesday June 29, 2021

ఇసుక వ్యవహారంలో ప్రభుత్వం వేసిన తప్పటడుగు... ఏకంగా 20వేల మంది కార్మికుల్ని రోడ్డున పడేసింది. ఇసుక విక్రయాలను జేపీ పవర్‌కు ఇచ్చేటప్పుడు పడవ ర్యాంపుల సంగతిని ప్రభుత్వం మర్చిపోయింది. దీంతో à°† ర్యాంపుల్లో ఇసుక కొనుగోలు, విక్రయాలను జేపీ పవర్‌ ఆపేసింది. ఫలితంగా గోదావరి లోపలకు వెళ్లి ఇసుక తవ్వి ఒడ్డుకు తెచ్చి అమ్మే పడవ ర్యాంపుల నుంచి ఇసుక కొనుగోలు ఆగిపోయింది. పడవ కార్మికులు ఇప్పటికే తీసిన లక్షలాది టన్నుల ఇసుక వరదొస్తే మునిగిపోయే పరిస్థితిలో ఉండగా...మరోవైపు వేలమంది కార్మికులకు పనిలేకుండా పోయింది. దాదాపు నెలరోజుల నుంచి పడవ ర్యాంపులు మూతబడటంతో కార్మికులంతా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అసలే కరోనా కాలం, పైగా పనులూ లేకపోవడంతో తమ పరిస్థితి ఘోరంగా తయారైందని ఆవేదన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానాన్ని మార్చి ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు చేపట్టింది. టన్ను రూ.375చొప్పున అమ్మకాలు చేసింది. స్థానిక నేతలు, ఇసుక అక్రమార్కులు విపరీతమైన అవినీతికి పాల్పడడం, దొడ్డిదారిన ఇసుక తరలించి విక్రయించేసుకోవడం విపరీతంగా జరిగింది. à°† తర్వాత ప్రభుత్వం à°ˆ విధానాన్ని మార్చి జేపీ పవర్‌కు ఇసుక విక్రయాలను అప్పగించింది. జేపీ పవర్‌ ఏడాదికి రూ.700కోట్లు ప్రభుత్వానికి చెల్లించేలా...ప్రతిగా ఇసుక టన్నుకు రూ.475చొప్పున అమ్ముకునేలా ఒప్పందం జరిగింది. ఇక్కడే à°’à°• విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయింది. పడవ ర్యాంపుల్లోనూ ఇసుకను తీసుకుని ఇదే రేటుకు అమ్మాలన్న షరతు పెట్టలేదు.

 

ఎవరిది పూచీ?

ర్యాంపులు రెండు రకాలు. à°’à°•à°Ÿà°¿ లారీలు నేరుగా వెళ్లిపోయే ర్యాంపులు à°’à°•à°°à°•à°‚. ఇక్కడ ప్రొక్లెయినర్లు పనిచేస్తాయి. ఇసుకను తవ్వి ఎత్తి నేరుగా లారీల్లోకి లోడ్‌ చేసేస్తాయి. రెండోది పడవ ర్యాంపులు. ఇక్కడ తొలుత నదిలోనుంచి ఇసుకను తవ్వి పడవల్లో ఒడ్డుకు తెస్తారు. అలా తీసుకొచ్చిన ఇసుకను ప్రభుత్వం కానీ, ప్రైవేటు కంపెనీ కానీ తీసుకుంటాయి. ఒడ్డున యంత్రాలు పెట్టుకుని అలా పడవల ద్వారా వచ్చిన ఇసుకను మళ్లీ లారీలోకి పోయాలి. అంటే పడవ ర్యాంపుల్లో కొంత ఖర్చు ఎక్కువ ఉంటుంది. అయితే à°ˆ ర్యాంపుల విషయాన్నే ప్రభుత్వం టెండరు డాక్యుమెంట్‌లో పెట్టకపోవడం వల్ల..ఇప్పుడు à°† అదనపు ఖర్చును మేమెందుకు భరించాలని...అది ఒప్పందంలో లేదు కదా! అని జేపీ పవర్‌ వాదిస్తోంది. 

 

మరోవైపు ఒప్పందంలో పడవ ర్యాంపుల అంశం పెట్టడం మర్చిపోయిన ప్రభుత్వం ... తన లాభాల్ని తగ్గించుకునేందుకు సైతం ముందుకురావడం లేదు. దీంతో  పడవ ర్యాంపుల్లో ఇసుక విక్రయాలు ఆగిపోయాయి. పడవ ర్యాంపులు రాష్ట్రంలో సుమారు 50 వరకు ఉన్నాయి. వీటిలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనే 43 వరకు ఉన్నాయి. పడవల యజమానులు, ఒక్కో పడవ మీద 10-20మంది కార్మికులు, ఇతరులు కలిపి మొత్తంగా 50ర్యాంపుల్లో కలిసి 20వేల మంది జీవనాధారం ఆధారపడి ఉంది. పడవ మీద ఇసుక తెచ్చే కార్మికులకు టన్నుకు సుమారు రూ.200 చొప్పున చెల్లిస్తారు. గతంలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక విక్రయాలు నడిచినప్పుడు à°ˆ మొత్తాన్ని పడవ సంఘాలకు చెల్లించి...మిగిలింది తన లాభంగా తీసుకునేది. ఇప్పుడు ప్రైవేటు కంపెనీ పడవ ర్యాంపుల దగ్గర ఇసుక కొనుగోలు చేయడం లేదు. ఇక్కడ కొనుగోలు చేస్తే రూ.200 పడవ కార్మికులకే ఇవ్వాల్సి వస్తుందని...à°† తర్వాత తమ ఖర్చులు కూడా కలిపితే తమకు ఇక మిగిలేది ఏమీ ఉండదని అంటోంది. 

 

నదిలో తీసిన ఇసుకను పడవలతో ఒడ్డుకు తెచ్చినందుకు వాళ్లకు దక్కేది టన్నుకు రూ. 200! పాత ప్రభుత్వంలో à°…à°‚à°¤ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం కూడా ఇటీవలిదాకా ఇంతే ఇచ్చింది. కానీ, కొత్త విధానం à°ˆ కార్మికుల ‘పడవ’ను తలకిందులు చేసింది. ర్యాంపులు మాట్లాడుకొన్న ప్రైవేటు సంస్థ.. ‘భార’మని తప్పుకొంటే, కొత్తపాలసీతో బాగానే ఆదాయం మిగుల్చుకొంటున్న ప్రభుత్వానికేమో,ఏటా రూ.30 కోట్లు భరించడానికి మనస్సు రావడంలేదు!

 

సర్కారు తగ్గితే సమస్య లేనట్టే.. 

వాస్తవానికి ప్రభుత్వం ఇసుక విధానాన్ని మార్చినప్పుడు వినియోగదారులపై భారం తగ్గుతుందేమోనని అనుకున్నారు. అయితే గతంలో రూ.375కు అమ్మగా ఇప్పుడు టన్నుకు రూ.475కు అమ్ముకునేందుకు అవకాశమిచ్చింది. ఫలితంతా తనకు ఏటా రూ.700కోట్లు వచ్చేలా ఒప్పందం చేసుకుంది. అదే గతంలో ఏపీఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలు నిర్వహించినప్పుడు à°ˆ లాభాలు ఏడాదికి రూ.400కోట్లు మించలేదు. ఇప్పుడు రూ.300కోట్ల పైచిలుకు ఆదాయం పెరిగినా...పడవ ర్యాంపుల కార్మికులకు కొంత సబ్సిడీ ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వం ముందుకురావడం లేదు. పడవ ర్యాంపుల్లో  కూడా ఇసుకను రూ.475కే అమ్ముకునేలా జేపీ పవర్‌కు అప్పచెప్పి, పడవ కార్మికులకు ఇవ్వాల్సిన టన్నుకు రూ.200ను ప్రభుత్వం చెల్లిస్తే సరిపోతుంది. ఇలా చేసినా ప్రభుత్వం మీద పెద్ద భారమేమీ పడదు. మొత్తం ర్యాంపుల్లో పడవ ర్యాంపులు 10శాతమే. మహా అయితే ఏటా రూ.30కోట్ల మేర ఖర్చుకావచ్చు. రూ.300కోట్ల పైచిలుకు ఏటా ఆదాయం పెంచుకున్న ప్రభుత్వానికి ఇది అసలు భారమే కాదు. నిజానికి పడవ సంఘాల ర్యాంపులు ఇప్పటివి కావు. అవి దశాబ్దాలుగా ఉన్నాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. కానీ అప్పుడు కూడా పడవ ర్యాంపు కార్మికులకు టన్నుకు ఇంతని చెల్లించారు. 

 

అప్పట్లోనే టన్నుకు రూ.150చొప్పున పడవ కార్మికులకు చెల్లించారు. à°† తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీఎండీసీ కూడా చెల్లించింది. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ముందుకు రాకపోవడం.. మేం ఎందుకు అదనంగా ఖర్చుపెట్టాలి అని జేపీ పవర్‌ అనుకోవడం వల్ల కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది.