కత్తి మహేశ్‌ కు ఏపీ ప్రభుత్వం సాయం

Published: Friday July 02, 2021

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన నటుడు, సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద కారు డ్రైవ్ చేస్తూ కత్తి మహేశ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో మహేశ్‌ చికిత్స నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఆర్థికసాయం ప్రకటించింది. ఈ క్రమంలోనే సీఎం రిలీఫ్ ఫండ్‌ నుంచి రూ.17లక్షలను చెన్నై అపోలో ఆస్పత్రి ఖాతాలో జమ చేసింది.