విశాఖలో డీజీపీ పర్యటన

Published: Friday July 09, 2021

రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ రెండు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం డీజీపీ విశాఖకు చేరుకున్నారు. ఇందులో భాగంగా కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్ స్థలాన్ని డీజీపీ పరిశీలించనున్నారు. పోలీస్ కమిషనరేట్‌లో ఉన్నధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దిశ యాప్ డౌన్‌లోడ్, అవగాహన తీరుపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. జిల్లా క్రైం రేట్‌పై డీజీపీ రివ్యూ నిర్వహించనున్నారు. రాజధాని తరలింపు నేపథ్యంలో డీజీపీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.