శ్రీశైలంలో ఆర్జిత సేవలు పున:ప్రారంభం

Published: Saturday July 10, 2021

 ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంభికా మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం నుండి యధావిధిగా ఆర్జిత సేవలను దేవస్థానం పున:ప్రారంభించనుంది. కోవిడ్ నిబంధనలలో భాగంగా పరిమిత సంఖ్యలో మాత్రమే  ఆన్‌లైన్‌లో టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. ఆర్జిత సేవలలో విడతల వారిగా సామూహిక అభిషేకం, కుంకుమార్చన ఆశీర్వచనలు, హోమాల నిర్వహణ జరుగనుంది. కాగా... గర్భాలయంలో అభిషేకాలు, గర్భాలయ దర్శనాలకు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని వచ్చిన వెంటనే భక్తులను అనుమతిస్తామని ఈవో  కె.ఎస్.రామారావు వెల్లడించారు.