82ఏళ్లు బామ్మ అంతరిక్షయాత్ర

Published: Sunday July 11, 2021

అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ తమ బ్లూ ఆరిజిన్ తొలి మానవ అంతరిక్షయాత్రలో వాలీ ఫంక్‌ను అతిథిగా తీసుకువెళుతున్న వార్త రాగానే అందరి దృష్టి à°† వృద్ధ మహిళ మీదకు మళ్లింది. à°ˆ బామ్మే ఎందుకు అనే సందేహం కూడా వచ్చింది. వాలీ ఫంక్ బయోడేటా చూస్తే ఆమె గొప్పతనం ఇట్టే అర్థం అవుతుంద

 

అమెరికాలో 1960-61లో నెలకొల్పిన మెర్యూరీ 13లో ఫంక్ సభ్యరాలు. ఇది మహిళల స్పేస్ ప్రాజెక్ట్. నాసా వ్యొమగాములకు ఇచ్చే శిక్షణే à°ˆ మహిళలకూ ఇచ్చారు. అన్ని విధాలుగా ఫంక్ à°ˆ శిక్షణలో ముందుంది. కాకపోతే మహిళ అనే కారణంతో ఆమెను స్పేస్‌లోకి పంపించలేదు. అయినా ఆమె అధైర్యపడకుండా పైలెట్‌à°—à°¾ సుశిక్షితురాలైంది. మొత్తం 19,600 à°—à°‚à°Ÿà°² ఫ్లయిట్ టైమ్ ఆమె సొంతం. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డులో వాలీ ఫంక్ తొలి ఎయిర్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ కావడం విశేషం. బెజోస్ ఆమెను బ్లూ ఆరిజిన్‌లో అతిథిగా ఎంపిక చేసుకోవడం ఆమెకు దక్కిన గౌరవం. ఎప్పుడో అంతరిక్షంలోకి వెళ్లాల్సిన ఫంక్‌ను ఇప్పుడు అవకాశం వెతుక్కుంటూ వచ్చిందంటూ అంతర్జాతీయ సమాజం అభినందనలు కురిపిస్తోంది. 

 

ఇప్పటి వరకు అంతరిక్షంలోకి వెళ్లిన అత్యంత వృద్ధుడి రికార్డు అమెరికన్ అస్ట్రోనాట్ జాన్ గ్లెన్ పేరు మీద ఉంది. ఆయన తన 77ఏళ్ల వయసులో స్పేస్‌లోకి ప్రయాణించారు. à°† రికార్డును వాలీ ఫంక్ ఇప్పుడు ఛేదించబోతోంది. ఎప్పటికైనా స్పేస్‌లోకి అడుగుపెట్టాలన్న ఆశయంతో ఉన్న ఆమె రిచర్డ్ బ్రాన్‌సన్ ‘వర్జిన్ గాలస్టిక్ స్పెస్‌క్రాఫ్ట్’లో ప్రయాణించడానికి 2019‌లోనే టికెట్ కొనిపెట్టుకుంది. ఇప్పుడు బెజోస్ తన బ్లూ ఆరిజిన్‌లోకి ఆమెను అతిథిగా ఆహ్వానించాడు. నిజమైన కలలు ఎప్పటికైనా సాకారమవుతాయనడానికి మరో నిలువెత్తు నిదర్శనం వాలీ ఫంక్.