సొంత స్థలాలున్నవారికి మొండిచేయి..

Published: Sunday July 18, 2021

కష్టపడి స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలనుకునే పేదలకు వైసీపీ ప్రభుత్వంలో చుక్కెదురవుతోంది. సొంత స్థలం ఉండటమే à°† పేదలకు ఇప్పుడు శాపంగా మారింది. ఏ ప్రభుత్వంలో అయినా స్థలం ఉంటే ఇళ్లు వెంటనే మంజూరవుతాయి. కానీ, వైసీపీ ప్రభుత్వంలో సొంత స్థలం ఉండటమే తప్పు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. పేదలకు ప్రభుత్వమే స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టుకోమని ప్రోత్సహిస్తుంటే, మాకు స్థలం ఉంది ఇల్లు ఇవ్వండి చాలు అని వేడుకుంటున్నా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు పొందినవారికే ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సొంత స్థలాలున్న లక్షలాది మంది పేదలు దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకుగానీ పక్కా ఇళ్ల పథకాన్ని పట్టాలెక్కించలేకపోయింది. పేదలకు స్థలాల పంపిణీ ఆలస్యమవుతుండటంతో, సొంత స్థలాలు ఉన్నవారినీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. స్థలాల పంపిణీ జరిగాక అయినా వారితో పాటు తమకూ ఇళ్లు మంజూరు చేస్తుందని ఆశించగా, జగనన్న కాలనీల లేఅవుట్లలో ఇళ్లకే తమ ప్రాధాన్యం అని తేల్చేసింది. దీంతో ఇళ్లు కట్టుందామనే ఆశతో రెండేళ్లుగా ఎదురుచూస్తున్న పేదల ఆశలు ఆవిరయ్యాయి. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా, అందులో 11.26 లక్షల ఇళ్లు జగనన్న కాలనీల్లోని లేవుట్లలోనివే. సొంత స్థలాలు న్న 4.33లక్షల మందికి మాత్రమే ఇళ్లు మంజూరుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10లక్షల మందికిపైగా సొంత స్థలాలు కలిగిన పేదలు ఉన్నారని à°—à°¤ ప్రభుత్వంలో చేసిన సర్వేలో తేలింది. వారి సంఖ్య ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుందని అంచనా. ప్రభుత్వం రాయితీ ఇస్తే ఇళ్లు కట్టుకునేందుకు చాలామంది పేదలు సిద్ధంగా ఉన్నారు. కానీ, జగనన్న కాలనీలపైనే దృష్టిపెట్టిన ప్రభుత్వం సొంత స్థలాలున్న వారి గోడు వినడం లేదు. 

 

కేంద్రం ఇచ్చే ఇళ్లపైనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆధారపడింది. పీఎంఏవై-గ్రామీణ్‌, అర్బన్‌ à°•à°¿à°‚à°¦ కొన్నేళ్లుగా కేటాయించిన ఇళ్లు ప్రస్తుతం 17 లక్షలు ఉన్నాయి. à°† ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రాయితీ ఇస్తుంది. అంతకంటే ఎక్కువ మంజూరుచేస్తే రాయితీ భారం రాష్ట్రమే భరించాలి. అందుకే à°† సంఖ్యకు మించకుండా తొలిదశలో 15.6 లక్షల ఇళ్లను మాత్రమే సర్కారు చేపట్టింది. పట్టణ అభివృద్ధి సంస్థల à°•à°¿à°‚à°¦ వచ్చిన ఇళ్లను గ్రామాలకు వినియోగించింది. యూడీఏ అనే పేరు ఉన్నప్పటికీ à°† పరిధిలోని గ్రామాలకూ à°† ఇళ్లను మంజూరుచేయవచ్చు. దీంతో యూడీఏలకు వచ్చిన ఇళ్లలో ఎక్కువ శాతం యూడీఏల్లోని గ్రామాల్లో ఉన్న జగనన్న కాలనీలకు వెళ్లిపోయాయి. మిగిలిన ఇళ్లను యూడీఏల పరిధిలో ఉన్న గ్రామాల్లోని సొంత స్థలాల పేదలకు మంజూరు చేస్తున్నారు. ఇక యూడీఏలలో లేని పేదలకు అసలు ఇళ్లు ఇచ్చే పరిస్థితే లేదు. ఎందుకంటే యూడీఏల్లోని ఇళ్లకైతే కేంద్రం రూ.లక్షన్నర రాయితీ ఇస్తుంది.  పీఎంఏవై-గ్రామీణ్‌ à°•à°¿à°‚à°¦ అయితే కేంద్రం రాయితీ అందులో సగంకూడా ఉండదు. దీంతో రాష్ట్రమే రఒక్కో ఇంటికి సుమారు రూ.లక్షకు పైగా ఇవ్వాల్సి వస్తుంది. అందుకే యూడీఏల్లో లేని గ్రామాలకు ఇళ్లు ఇవ్వడం లేదు. తమ స్థలాలకు ఇళ్లు మంజూరుచేయలంటూ లక్షలాది మంది పంచాయతీ, హౌసింగ్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకాలం ఎదురుచూసినా ప్రయోజనం లేకుండా పోయిందని, à°—à°¤ ప్రభుత్వంలోనే కట్టుకుని ఉంటే బాగుండేదని పేదలు వాపోతున్నారు