స్వర్ణ తులసీదళాలతో అప్పన్న స్వామికి ఏకాదశి పూజలు

Published: Wednesday July 21, 2021

పవిత్రమైన తొలి ఏకాదశిని పురస్కరించుకుని వరాహలక్ష్మీనృసింహస్వామికి మంగళవారం స్వర్ణ తులసీ దళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారిని వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రభాత ఆరాధనలు జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయదేవేరులతో ప్రత్యేక రజిత వేదికపై ఉంచి స్వర్ణ తులసీదళాలతో  పూజలు చేశారు. భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. ఏర్పాట్లను ఏఈవో కేకే రాఘవకుమార్‌ పర్యవేక్షించారు.