జగన్కు మరోసారి చుక్కెదురు

Published: Friday July 23, 2021

జగన్ సర్కార్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో మరోసారి చుక్కెదురయ్యింది. శుక్రవారం నాడు రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ పిటిషన్లపై.. జస్టిస్‌ రామకృష్ణన్‌ నేతృత్వంలోని ఎన్జీటీ బెంచ్‌లో ఈ విచారణ జరిగింది. ప్రాజెక్టు సందర్శనకు ఏపీ సహకరించట్లేదని కృష్ణా బోర్డు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం పనులు చేస్తోందని పిటిషనర్‌ పేర్కొన్నారు. అయితే.. ప్రాజెక్టు సందర్శనకు పంపించాల్సిన అవసరం లేదని చెప్పిన ఏపీ ప్రభుత్వం.. తామే అక్కడి పరిస్థితులను వివరిస్తూ సమాధానం ఇస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు.. డీపీఆర్‌ తయారీకి అధ్యయనం మాత్రమే చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం వివరించింది.