ఏపీలో కొత్తగా 2,174 కరోనా కేసులు

Published: Saturday July 24, 2021

ఏపీలో కొత్తగా 2,174 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 18 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 19,52,513 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 13,241 మంది మృతి చెందారు. 22,358 యాక్టివ్‌ కేసులు ఉండగా, 19,16,914 రికవరీ అయ్యారు. గత 24 గంటల్లో 2,737 మంది రికవరీ అయ్యారు. కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.