కర్ణాటక 23వ సీఎంగా బొమ్మై ప్రమాణస్వీకారం

Published: Wednesday July 28, 2021

 

కర్ణాటక 23à°µ ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు బొమ్మైతో గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. అంతకు ముందు ఆయన బీజేపీ కేంద్ర పరిశీలకుడు ధర్మేంద్ర ప్రధాన్, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో భేటీ అయ్యారు. ప్రమాణస్వీకారానికి వెళ్లే ముందు బెంగళూరులోని మారుతీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

 

యడియూరప్ప కేబినెట్‌లో హోమ్ మినిస్టర్‌à°—à°¾ బొమ్మై పని చేసిన విషయం తెలిసిందే.  లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన బసవరాజ బొమ్మైను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బెంగళూరులో జరిగిన బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశంలో 61 ఏళ్ల బొమ్మై పేరును సీఎం పదవికి యడియూరప్ప ప్రతిపాదించగా గోవింద కారజోళ బలపరిచారు. బీజేపీ అధిష్ఠానం తరఫున పరిశీలకులుగా హాజరైన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, కిషన్‌రెడ్డిలు.. బొమ్మై పేరును అధికారికంగా ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యేలంతా కరతాళ ధ్వనులతో ఆమోదించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పును సాఫీగా జరిగేలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ అధిష్ఠానం యడియూరప్ప వారసుడి ఎంపిక ప్రక్రియను అంతే సాఫీగా పూర్తి చేయడంలో సఫలీకృతమైంది. ఆర్‌.అశోక్‌(వక్కలిగ), గోవింద కారజోళ(దళిత), బి.శ్రీరాములు (బోయ) ఉప ముఖ్యమంత్రులుగా బొమ్మై కేబినెట్‌లో చేరారు.