ఇద్దరు భారత అథ్లెట్లకు వైద్యం, శిక్షణ అందించడంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర

Published: Friday August 06, 2021

 à°Ÿà±‹à°•à±à°¯à±‹ ఒలింపిక్స్‌కు ముందు ఇద్దరు భారత అథ్లెట్లకు అమెరికాలో మెరుగైన వైద్యం, శిక్షణ అందించడంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర ఉందని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వెల్లడించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చాను తన ఆరోగ్య సమస్యలను à°“ పబ్లిక్ ఫంక్షన్‌లో ముఖ్యమంత్రి బీరెన్‌కు తెలియజేసింది. à°† విషయం ప్రధాని కార్యాలయానికి తెలియడంతో ఆమెకు అమెరికాలో మెరుగైన వైద్యం, శిక్షణ అందించేందుకు సహాయపడ్డారని తెలిసి ఆశ్యర్యపోయానని ముఖ్యమంత్రి బీరేన్ తెలిపారు.

 

ఒకవేళ ఆమె అమెరికా వెళ్లి కండరాల ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటే పతకం సాధించకపోయి ఉండేదని అన్నారు. సాక్షాత్తు ప్రధానే ఆమెకు సహాయం చేశారని తెలుసుకుని మణిపూర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని బీరేన్ తెలిపారు. à°ˆ వారం తాను ఢిల్లీలో మోదీని కలిసినపుడు కృతజ్ఞతలు చెప్పానని అన్నారు. ఇంకొక అథ్లెట్‌కు కూడా ప్రధాని సహాయం చేశారని, అది ఆయన గొప్పతనం అని బీరేన్ పేర్కొన్నారు.