జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు అనుమతి

Published: Saturday August 07, 2021

అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి  భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శనివారం ట్విటర్ వేదికగా à°ˆ వివరాలను తెలిపారు. 

 

మన్‌సుఖ్ మాండవీయ ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశం తన వ్యాక్సిన్ బాస్కెట్‌ను పెంచుకుందని తెలిపారు. భారత దేశంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి  అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు దేశంలో 5 ఈయూఏ (ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్) వ్యాక్సిన్లు ఉన్నాయన్నారు. కోవిడ్-19 మహమ్మారిపై భారత దేశ ఉమ్మడి పోరాటాన్నిఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. 

 

బయలాజికల్ à°ˆ లిమిటెడ్ ద్వారా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ను మన దేశానికి తీసుకొస్తారు. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కోసం దరఖాస్తు చేసిన రెండు రోజుల్లోనే à°ˆ వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది.