విశాఖలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

Published: Sunday August 08, 2021

 కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా రెండోరోజు ఆదివారం ఉదయం చిన్న వాల్తేర్‌లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగానే వ్యాక్సినేషన్ ఇస్తోందన్నారు. మరో రెండు వ్యాక్సిన్‌లకు కూడా అనుమతి లభించిందని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామని  నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి, బీజేపీ నేతలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.