జగన్‌ ఆస్తుల్లో సగం షర్మిలకు ఇవ్వాలి

Published: Thursday August 12, 2021

 à°†à°‚ధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాత్ర కూడా ఉందని, బాగా ప్రచారం చేశారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారన్నారు. అయితే జగన్‌కు ఉన్న ఆస్తుల్లో సగ భాగం షర్మిలకు ఇవ్వాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయంలో సగ భాగం పాత్ర వహించిన షర్మిలకు ఆస్తిలో కూడా సగ భాగం ఇవ్వాలని రఘురామ అన్నారు.