కలగానే మిగిలిన కోరిక
Published: Sunday August 15, 2021

భారత దేశానికి జాతీయ జెండాను అందించిన ఘనత పింగళి వెంకయ్యది. ఆయన అందించిన జాతీయ జెండా నేడు మనకు గుర్తింపు, గౌరవం అందిస్తోంది. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పింగళి వెంకయ్యను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పింగళికి భారత రత్న ఇవ్వాలన్న కుటుంబసభ్యుల కోరిక కలగానే మిగిలింది.
పింగళి వెంకయ్య గురించి తెలియని ఎన్నో విషయాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారసులు చెబుతున్నారు. జాతీయ జెండా రూపకల్పనే కాకుండా సామాజిక అంశాల్లో సయితం ఉత్సాహంగా పనిచేసేవారని ఎన్నో పుస్తకాలు కూడా పింగళి వెంకయ్య రచించారని చెప్పారు. దేశానికి జాతీయ జెండాతో గౌరవం, గుర్తింపు ఇచ్చిన పింగళి వెంకయ్యకు భారత రత్న దక్కాలని వారసులు కోరుకుంటున్నారు.

Share this on your social network: