జగన్ ప్రభుత్వానికి విద్యుత్ ట్రైబ్యునల్‌లో చుక్కెదురు

Published: Monday August 16, 2021

జగన్ ప్రభుత్వానికి విద్యుత్ ట్రైబ్యునల్‌లో చుక్కెదురైంది. ఏపీ డిస్కంలపై కోర్టు ధిక్కరణ చర్యలకు విద్యుత్ ట్రైబ్యునల్‌ ఆదేశించింది. పీఎస్ఏ ఒప్పందాల రద్దు లేఖపై విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్ స్టేకు ఆదేశించింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై ఇచ్చిన తీర్పును ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించింది. ఏపీ డిస్కం సంస్థలపై విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్‌ సంస్థలపై కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించాలని, నోటీసులను జారీ చేయాలని రిజిస్ట్రీని  ట్రైబ్యునల్ ఆదేశించింది.