, ప్రజలు దోచుకునేవారిని ఎన్నుకుంటున్నారని కేఏ పాల్ ఆవేదన

తెలుగు రాష్ట్రాలు దివాలా తీశాయని, ప్రజలు దోచుకునేవారిని ఎన్నుకుంటున్నారని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. జయప్రకాష్ నారాయణ చాలా మంచివారని.. అలాంటి వారు కావాలా.. వద్దా..? ఆయన ప్రశ్నించారు. అప్పులు తీర్చాలంటే ఆదాయం కావాలని.. ఏపీ నాశనమైపోయిందన్నారు. బాగా డబ్బున్న తెలంగాణ కూడా నాశనమైపోయిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలంటే తనకు ఎంతో అభిమానమని, తెలుగు రాష్ట్రాలు నాశనమైపోతుంటే ఎంతో బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలూ ఒకటైతే అప్పులు తీర్చి ఐదేళ్లలో అభివృద్ధి చేస్తనని: కేఏ పాల్ తెలిపారు. వివేకాను చంపిన వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. వివేకా తనకు బాగా తెలుసని, ఫోర్స్ చేసి ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని పాల్ తెలిపారు. అంత మంచాయనని ఇంత దారుణంగా హతమార్చారని మండిపడ్డారు. దేశం నాశనం అవ్వడానికి రాజకీయ నేతలు కాదని.. ప్రజలేనన్నారు. ఇప్పటికైనా అందరం కలిసి పోరాడుదామని కేఏ పాల్ పిలుపు నిచ్చా

Share this on your social network: