రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ రాఖీ పండుగ శుభాకాంక్షలు

Published: Sunday August 22, 2021

తెలుగు రాష్ట్ర ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయుల బాంధవ్యాలను చాటే వేడుకే రక్షాబంధన్ అని అన్నారు. అత్యాచారాలను అడ్డుకోగలగడమే నిజమైన రక్షాబంధన్ అని పేర్కొన్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న దురాగతాలు బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన దుస్సంఘటనలు మనసును కలిచివేశాయని తెలిపారు. ఆడపిల్లలంతా మన అక్కాచెల్లెళ్లు అనే భావన రావాలన్నారు. ఆడపడుచులు నిర్భయంగా తిరిగేలా భరోసా ఇవ్వాలని పవన్ తెలిపారు.