సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడుంటే.. అదే రాజధాని
Published: Tuesday August 31, 2021

సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడుంటే.. అదే రాజధాని అనుకోవాలని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ఉన్న చోటే రాజధాని అనుకోవాలని.. అది పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు.. రేపు మరో ప్రాంతం కావచ్చు అని చెప్పారు. సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే.. సెక్రటేరియెట్, అదే రాజధాని అని స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీఎం జగన్.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దానికి అంతా కట్టుబడి ఉన్నామని తెలిపారు. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కరోనా కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Share this on your social network: