టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట చార్మి

Published: Thursday September 02, 2021

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట చార్మి హాజరయ్యారు. గురువారం ఉదయం ఆమె ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయానికి వచ్చారు. చార్మి రాక సందర్భంగా ఆమె బౌన్సర్లు ఓవరాక్షన్ చేశారు. పూరి జగన్నాథ్, చార్మి ఇద్దరూ కలిసి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గతంలో సూదీర్ఘంగా విచారణ చేశారు. డ్రగ్స్ కింగ్ కెల్విన్‌కు చార్మికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు దొరకడంతో అప్పట్లో చార్మిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. కెల్విన్, చార్మిల మద్య ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్‌లు ఉన్నాయనే సమాచారం. దీంతో అధికారులు కెల్విన్ మొబైల్ సీజ్ చేసి అందులో కాంటక్ట్ నెంబర్లను పరిశీలించగా చార్మి నెంబర్‌ను ‘దాదా’ అనే పేరుతో కెల్విన్ సేవ్ చేసుకున్నట్లు తెలియవచ్చింది.

 

ఈడీ అధికారులు కూడా కెల్విన్‌తో ఉన్న పరిచయాలపై ఆరా తీయనున్నారు. చార్మి ద్వారా పూరి జగన్నాధ్‌కు కెల్విన్ పరిచయం అయ్యారా? లేక పూరి ద్వారానే చార్మికి కెల్విన్ పరిచయం అయ్యారా? అనే దానిపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. చార్మి, కెల్విన్‌కు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణపై అధికారులకు కెల్విన్ అన్ని విషయాలు చెప్పడంతో à°ˆ మేరకు విచారణకు రావాలంటూ చార్మికి నోటీసులు ఇచ్చారు. దీంతో ఆమె ఇవాళ విచారణకు హాజరయ్యారు. కాగా నిన్న పూరి జగన్నాధ్‌ను అధికారులు సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే.