భార్యకు AIDS అని తెలిసి 8 మంది భర్తలకు టెన్షన్.

పెళ్లి చేసుకోవాలనుకుంటున్న మధ్య వయస్కులకు వల వేస్తుంది.. గుట్టు చప్పుడు కాకుండా గుళ్లో పెళ్లి చేసుకుంటుంది.. పెళ్లి తర్వాత భర్తతో గొడవపడుతుంది.. అతడిని భయపెట్టి సెటిల్మెంట్‌కు రప్పిస్తుంది.. అందినంత దోచుకుని అక్కణ్నుంచి పరారవుతుంది.. ఇలా ఇప్పటివరకు ఆమె ఎనిమిది మందిని పెళ్లి చేసుకుంది.. తొమ్మిదో పెళ్లి చేసుకోబోతుండగా పోలీసులకు చిక్కింది.. షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే పోలీసులు చేయించిన హెచ్‌ఐవీ పరీక్షలో ఆమెకు పాజిటివ్ అని తేలింది.. దీంతో ఆమె గతంలో పెళ్లి చేసుకున్న ఎనిమిది మందికి కూడా పరీక్షలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు..
హర్యానాలోని కైతాల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళకు 2010లో పాటియాలాలో వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలకు తల్లి కూడా అయింది. అయితే నాలుగేళ్ల తర్వాత భర్త అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా అతని ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమె బతుకు తెరువు కోసం కుటుంబ సభ్యులతో కలిసి మోసాలు చేయడం ప్రారంభించింది. పంజాబ్, హర్యానాలలో బ్రహ్మచారులు, విడాకులు తీసుకున్న లేదా భార్య చనిపోయిన భర్తలను ట్రాప్ చేయడం మొదలుపెట్టింది. తన తల్లితో పాటు మరికొందరు బంధువులతో కలిసి ఆమె దీనిని ప్రారంభించింది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న 30-40 మధ్య వయసు కలిగిన వ్యక్తిని ట్రాప్ చేసి అతడిని రహస్యంగా ఏ గుడిలోనో పెళ్లి చేసుకుంటుంది.
వారం రోజులు కాపురం చేసిన తర్వాత భర్తతో ఏదో విధంగా గొడవపెట్టుకుంటుంది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతానని హెచ్చరిస్తుంది. చివరకు సెటిల్మెంట్‌కు రప్పించి లక్షల్లో భరణం కింద తీసుకుంటుంది. తర్వాత అక్కణ్నుంచి పరారవుతుంది. ఇప్పటివరకు ఆమె మొత్తం 8 నకిలీ పెళ్లిళ్లు చేసుకుంది. ముగ్గురు యువకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమె గురించి గాలింపు మొదలుపెట్టారు. హర్యానాలో 9వ పెళ్లి చేసుకుంటుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జైలులో ఆమెకు హెచ్‌ఐవీ పరీక్ష చేయించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె గతంలో పెళ్లి చేసుకున్న ఎనిమిది మందికి కూడా పరీక్షలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు

Share this on your social network: