స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ వెళ్లదు

Published: Saturday September 04, 2021

స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ వెళ్లదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల ప్రయోజనాలకు ముప్పురాదని, మెరుగైన ప్యాకేజి దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్ర ప్రజలు ఎంతో నమ్మకంతో వైసీపీని గెలిపించారన్నారు. రెండున్నర ఏళ్లలో ప్రజలకు న్యాయం జరిగిందా అనే అనుమానం మొదలైందని తెలిపారు. మోసం, అవినీతి తప్పా ఏమీ లేదని ప్రజలు క్రమంగా గుర్తిస్తున్నారన్నారు. కక్షపూరితంగా  విధ్వంసకరంగా పాలిస్తున్నారని విమర్శించారు. ప్రజావేదికను కూల్చడంతో విధ్వంస పాలన మొదలైందని, దేవునిరథాలు తగులబెట్టేంత వరకూ వెళ్లిందని అన్నారు. ప్రతిపక్షాలపై కక్షసాధింపు ఎక్కువైందని మండిపడ్డారు. అదిరించి బెదిరించే చర్యలు ఎక్కువయ్యాయని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.