నగ్నంగా Video Call చేయాలని అడిగిన భర్త...కాదన్నందుకు

Published: Monday September 06, 2021

భార్యకు వీడియో కాల్ చేసిన ఎన్నారై భర్త à°“ వింత కోరిక కోరాడు. దీంతో కంగుతిన్న భార్య అందుకు ఒప్పుకోలేదు. తానలా చేయలేనని ప్రాథేయపడింది. కానీ à°† భర్త ఒప్పుకోలేదు. à°ˆ విషయం తెలుసుకన్న అత్తమామలు కొడుకుకు బుద్ధి చెప్పకపోగా.. కోడలినే దారుణంగా కొట్టారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. à°ˆ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది.

 

 

బాధిత మహిళ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. అహ్మాదాబాద్‌లోని గోటా ప్రాంతంలో ఆమె నివశిస్తోంది. తన భర్తను సొంత కమ్యూనిటీకి చెందిన మ్యాట్రిమొనీ సంస్థ ద్వారానే ఆమె మొదటిసారి కలిసింది. ఇరు కుటుంబాలూ ఒప్పుకోవడంతో 2020 ఆగస్టు 21à°¨ వారిద్దరికీ వివాహం జరిగింది. అయితే కొద్ది రోజులకే అతడు తన నిజస్వరూపం బయటపెట్టాడు. రోజూ మద్యం సేవించి ఇంటికి ఆలస్యంగా రావడం, తాగిన మత్తులో తూలుతూ ఇంటికి చేరుకోవడం, తనను కొడుతూ హింసించడం ప్రారంభించాడు. à°† తర్వాత కొన్నాళ్లకు చెప్పాపెట్టకుండా కెనడా వెళ్లిపోయాడు.

 

కెనడాకు వెళ్లిన తర్వాత నుంచి అసభ్యకరమైన, అనుచితమైన మెసేజ్‌లను భార్యకు పంపడం ప్రారంభించాడు. అలాగే సెల్‌ఫోన్‌లోనే సెక్స్ చాట్ చేయాలని, కెమెరా ముందు నగ్నంగా కనపడాలని ఒత్తిడి చేసేవాడు. దానికి బాధితురాలు అంగీకరించకపోవడం, తనకు అదంతా ఇష్టం లేదని, తాను చేయలేనని చెప్పడంతో అతడు బూతులతో విరుచుకుపడేవాడు. అలాగే తనపై లేనిపోనివి చెప్పి అత్తమామలతో కొట్టించేవాడు. కొడుకు చేస్తున్న పనికి తప్పుబట్టి బుద్ధి చెప్పాల్సిందిపోయి.. కోడలినే కొట్టి హింసించేవారు. అలాగే అదనపు కట్నంగా బంగారం, నగదు తీసుకురావాలని ఒత్తిడి చేసేవారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.