గుజరాత్ ముఖ్యమంత్రి రాజీనామా

గుజరాత్‌లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి శనివారంనాడు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్‌కు అందజేశారు. గాంధీనగర్‌లో జరిగిన సమావేశంలో చోటుచేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో విజయ్ రూపానీ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజీనామా సమర్పణ అనంతరం మీడియాతో రూపానీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా సేవలందించేందుకు తనకు అవకాశం కల్పించిన బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు చెప్పారు. రాజీనామా నిర్ణయంపై అడిగిన పలు ప్రశ్నలకు... ఐదేళ్ల సుదీర్ఘ కాలం సేవలందించానని చెప్పారు. నాయకత్వ మార్పు బీజేపీలో సాధారణ ప్రక్రియేనని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నాయకత్వంలో తాను సేవలు కొనసాగిస్తున్నానని తెలిపారు. గత ఐదేళ్లుగా బీజేపీపై ప్రజలు తమ విశ్వాసాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని రూపానీ చెప్పారు. 2016 ఆగస్టు 7న ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ పగ్గాలు చేపట్టారు. ఆయన గుజరాత్‌లోని రాజ్‌కోట్ వెస్ట్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Share this on your social network: