హీరో సాయి ధరమ్ తేజ్...సర్జరీ సక్సెస్..

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా అపోలో వైద్యబృందం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు బులెటిన్‌లో ప్రకటించారు. ఆయన వైద్యానికి సహకరిస్తున్నారని.. కొద్దిసేపటి క్రితమే సాయి తేజ్‌కి కాలర్ బోన్ ఆపరేషన్ చేశామని వైద్యులు తెలిపారు. ఆపరేషన్‌కు ఆయన సహకరించారని.. చికిత్స సక్సెస్ అయ్యిందని వైద్య బృందం తెలిపింది. మరి కొన్ని గంటలు సాయి డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంటారని వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. తేజ్‌కు సర్జరీ సక్సెస్ అయినట్లు కుటుంబ సభ్యులకు ఫోన్‌లో వైద్యులు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న మెగా బ్రదర్ నాగబాబు ఆస్పత్రికి చేరుకుని డాక్టర్లతో మాట్లాడారు. అంతకుముందు ఆస్పత్రికి మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ వచ్చి వెళ్లారు. అయితే.. మరో 24 గంటలు పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే తేజ్ ఉండనున్నారు. కాగా.. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

Share this on your social network: