టూరిజం, సినిమా రంగాలకు ఊపు!

Published: Monday September 13, 2021

  à°¸à°¾à°‚స్కృతిక, మతపరమైన, పర్యాటక, సినిమా రంగాలకు కొత్త ఊపునిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లు, రైళ్ల ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో భాగంగా.. బోగీలను లీజుకు ఇవ్వనుంది. అంతేకాదు.. ఆసక్తి ఉన్నవాళ్లు à°† బోగీలను పూర్తిగా కొనుగోలు చేయొచ్చు. ఐదేళ్ల పాటు లీజుకు ఇస్తామని, à°ˆ కాలంలో లీజుతో పాటు.. నిర్వహణ, పార్కింగ్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఇటీవల జరిగిన భారతీయ రైల్వే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల స్థాయి సమావేశం తీర్మానించింది. కనీసం 16 బోగీలను ఏకకాలంలో లీజుకు తీసుకోవాల్సి ఉంటుందనే నిబంధనను విధించింది. బోగీలను లీజుకు తీసుకున్న/కొనుగోలు చేసిన వారికి వాటిపై పూర్తి అధికారం ఉంటుంది. అంటే.. తమ బోగీలను తీసుకువెళ్లే సర్క్యూట్‌ రైళ్లను ఏయే రూట్లలో నడిపించాలి? ప్రయాణికుల టారిఫ్‌ వంటి నిర్ణయాధికారం లీజు/కొనుగోలుదారులదే. రైలు ఇంజన్‌, లోకోపైలట్ల రెమ్యూనరేషన్‌ à°•à°¿à°‚à°¦ ప్రయాణ దూరాన్ని, గంటలను బట్టి రైల్వేకు అదనపు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. రైల్వే తాజా నిర్ణయం కొన్ని రంగాలకు ఇతోధికంగా మేలు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు సినీ రంగంలో à°“ నిర్మాత 16 బోగీలను లీజుకు తీసుకుంటే.. ఐదేళ్ల పాటు తమకు నచ్చిన ప్రాంతాల్లో షూటింగ్‌ నిర్వహించుకోవచ్చు. అలాగే బోగీలను లీజుకు తీసుకున్న నిర్మాతలు, వాటిని ఇతర సినిమాలకు కూడా అద్దెకు ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక సాంస్కృతిక/మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేవారికీ ఇదో పెద్ద à°Šà°°à°Ÿ. కాశీ, రామేశ్వరం వంటి యాత్రలు చేయించేవారు.. తమ బృందాల్లోని అందరికీ టికెట్లు/బెర్తులు దొరక్క ఇబ్బందిపడుతుంటారు. ఇకపై à°† అవస్థలు ఉండబోవు. వారొక 16 బోగీలను ఐదేళ్లకు లీజుకు తీసుకుంటే.. ఏడాదికో పది ట్రిప్పులు తిప్పుకొనే అవకాశముంది. పర్యాటక రంగానికి కూడా à°ˆ నిర్ణయం కొత్త ఊపునివ్వనుంది. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు కూడా బోగీల లీజుతో.. తమ ఈవెంట్లకు కొత్త వేదికకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయి.