టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితా విడుదల

Published: Wednesday September 15, 2021

 à°Ÿà±€à°Ÿà±€à°¡à±€ కొత్త పాలకమండలిని ఏపీ ప్రభుత్వం నియమించింది. 25 మందితో టీటీడీ పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. à°ˆ పాలకమండలిలో ఏపీ నుంచి నలుగురు తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. 

 

 

పాలకమండలిలో పారిశ్రామిక వేత్త మైహోం రామేశ్వరరావు, హేటిరో పార్దసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ముంబాయికి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ రెండోవసారి సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, యంయస్‌యన్ ల్యాబ్స్ జీవన్‌రెడ్డి, కోల్‌కతాకు చెందిన సౌరభ్ పాలకమండలిలో చోటు దక్కించుకున్నారు. మహారాష్ట్ర నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్‍కు అవకాశం కల్పించారు.

 

టీటీడీ పాలక మండలి జాబితా

ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్, మల్లాడి క్రిష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, గొర్ల బాబూరావు

తెలంగాణ నుంచి జూపల్లి రామేశ్వరావు, రాజే శర్మ, పార్థసారధి రెడ్డి, కల్వకుర్తి విద్యాసాగర్ 

తమిళనాడు నుంచి శ్రీనివాసన్, ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య

కర్ణాటక నుంచి ఎమ్మెల్యే విశ్వనాధ్‌రెడ్డి, à°¶à°¶à°¿à°§à°°à± 

మహారాష్ట్ర నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్‍కు అవకాశం