సంచలన నిర్ణయం తీసుకున్న ఎంపీ కేశినేని నాని

Published: Friday September 24, 2021

ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని నెల రోజుల క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబుకు నాని చెప్పారని ప్రచారం జరుగుతోంది. తన కుమార్తె కూడా పోటీ చేయబోదని చంద్రబాబుతో నాని చెప్పారని చెబుతున్నారు. ఇప్పటికే తన కుమార్తె టాటా ట్రస్ట్‌కు వెళ్లిపోయిందని కేశినేని పేర్కొన్నారు. అయితే పార్టీలోనే కొనసాగుతానని చంద్రబాబుకు కేశినేని వివరించారు. ఈసారి వేరే అభ్యర్థిని చూసుకోవాలని చంద్రబాబుకు ఆయన సూచించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చానని కేశినేని చెప్పారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ఉన్నప్పటికీ అటువైపు నాని చూడలేదని à°† పార్టీ నేతలు చెబుతున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వివాదం నేపథ్యంలో పరాజయం తర్వాత పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారని చెబుతున్నారు. సొంత పార్టీ నేతలు విమర్శలు చేసినా హైకమాండ్ పట్టించుకోకపోవడంపై నాని అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. à°ˆ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్నారు. పార్టీలోనే కొనసాగుతానని కేశినేని నాని చెబుతున్నారు.