విద్యా కమిటీ ఎన్నికల్లో వైసీపీ కర్ర పెత్తనం

Published: Wednesday October 06, 2021

విద్యా కమిటీ ఎన్నికల్లో వైసీపీ కర్ర పెత్తనానికి దిగారు. గజపతినగరం మండలం మరుపల్లి కేజీబీవీ స్కూల్ దగ్గర టీడీపీ, వైసీపీ నేతల బాహాబాహికి దిగారు. టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు పిడిగుద్దులు కురిపించారు. దాంతో కొమరాడ మండలం పరుశురాంపురంలో విద్యా కమిటీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఎన్నిక నిర్వహించాల్సిన ప్రధానోపాధ్యాయుడిని సెలవుపై వెళ్లిపోవాలని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి వర్గీయులు హెచ్చరించారు. 24 మంది సభ్యుల్లో 18 మంది ఉన్నప్పటికీ ఎన్నిక వాయిదా పడింది