ఇక సామాన్లు సర్దుకోవాల్సిందేనా.. అసలేం జరిగింది.
వైసీపీలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తర్వాత నెంబర్ టూ పొజిషన్ విజయసారెడ్డిదే అని ఆయన అభిమానులు ఘనంగా చెప్పుకుంటారు. ఉత్తరాంధ్రలో ఆయనదే హవా... ముఖ్యంగా విశాఖలో అయితే ఆ నేత మాటకు తిరుగేలేదు. ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి, నెల్లూరు పెద్దా రెడ్డి అని ఆయన ప్రత్యర్దులు ముద్దుగా పిలుచుకుంటారు. ఆ మధ్యన విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా విశాఖలో ఎక్కడపడితే అక్కడ ప్లెక్సీలు, భారీ భారీ కటౌట్లు కట్టి ఆయన అభిమానులు ప్రేమను చాటుకున్నారు. వీటిని చూసిన వారు ఇది విశాఖపట్నమా..? విజయసాయి పట్నమా అనేలా చేశారు. అయితే వైసీపీలో ఆయనపై నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి కొద్దికొద్దిగా బయటపడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎంతలా అంటే ఆయన విశాఖ పట్నం కేంద్రంగా నడుపుతున్న రాజకీయాలకు పుల్‌స్టాప్ పెట్టాల్సిందే అనేంతంగా.
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాజ్యసభ ఎంపీ విజయసాయి అచరులను ఎవర్ని విశాఖలో ఉండవద్దని చెప్పినట్లు వార్తలు గుప్పుమన్నాయి.మరో వైపు విజయసాయి రెడ్డి అండ్ కో పై జరుగుతున్న ప్రచారాల నేపధ్యంలో ఆయన కూడా సైలెంట్ అయిపోయారట. అందుకే ఆయన విశాఖకు వచ్చినా...తన పని తాను చూసుకొని వెళ్లిపోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయసాయి అనుచరులు సెటిల్మెంట్లు చూసుకుంటూ దోచుకుంటున్నారని విస్త్రతంగా ప్రచారం జరుగుతోంది. ఇదే పంథా కొనసాగితే భవిషత్తులో పార్టీకి నష్టమని హైకమాండ్ దృష్టికి కొందరు తీసుకువెళ్లారంట.
పార్టీలో కొంతమంది సీనియర్లు ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన యోధానుయోధులు ..విసారె ఎత్తుగడలు, వ్యూహాలను ఎప్పటికప్పుడు కనిబెడుతూ, వ్యూహాత్మంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు.అయితే వీరంతా తమ రాజకీయ అనుభవంతో ఎక్కడా, విసారెని బహిరంగా వ్యతిరేకిస్తున్నట్లు కనబడరు...బయటపడరు. తమ చేతల ద్వార అభిప్రాయాలను చెప్పకనే చెబుతారు. అందుకే పార్టీ కార్యాలయంలోకానీ, ప్రభుత్వ కార్యాలయాలలో విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్ కానీ, కార్యాక్రమాల్లో కానీ ఆయనతో కలిసి పాల్గొనడానికి ఇష్టపడరు. ఆయనతో కలసి వేదికను పంచుకోవడానికి ఆసలు ఆసక్తి చూపించరు. వీరంతా సింగిల్‌గా వచ్చి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోతారు. లేదంటే నగరంలో ఏదైనా కార్యక్రమంలో హాజరై వెళ్లిపోతారు.
ఆ మధ్య విసారె ప్రకటన.. ఉత్తరాంధ్ర వైసిపి సీనియర్ నేతలలో రైళ్లు పరిగెత్తించింది. తాను విశాఖలో స్థలం కొని ఇక్కడే సెటిల్ అవుతానని ఆ ప్రకటన సారాంశం. దీంతో ఉత్తరాంధ్ర వైసిపి సీనియర్లలో అలజడి రేగింది. ఇప్పటికే తాము విజయసాయిరెడ్డి కారణంగా వెనకబడిపోతున్నామని, ఆయన ఇక్కడ సెటిల్ అయితే...తమకు రాజకీయ భవిషత్తుకు ఇబ్బంది తప్పదని అంచనా వేస్తున్నారట. చిత్రం ఏమిటంటే ..నెల్లూరు నుంచి వచ్చిన విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర సిఎం అని అంటున్నారు కానీ, ఉత్తరాంద్రలోనే పుట్టి పెరిగి, రాజకీయాలలో ఉన్న తమను ఏనాడూ ఎవరూ ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి అనలేదని ఒక సీనియర్ నేత తమ అనుచరుల వద్ద వాపోయారట.

Share this on your social network: