మగాడికో న్యాయం.. ఆడవాళ్లకో న్యాయమా?

Published: Tuesday October 19, 2021

 à°Žà°‚ఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మగాడికో న్యాయం.. ఆడవాళ్లకో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. ముస్లిం యువతులపై దాడుల గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయి ఇష్టపడి ఎవరినైనా ప్రేమిస్తే అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. బుర్ఖా వేసుకున్న అమ్మాయి మరొకరితో కనిస్తే దాడులు చేయడం తగదన్నారు. అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళితే ఎవరూ ఆపడానికి వీల్లేదన్నారు. ‘‘బుర్ఖా వేసుకోని అమ్మాయితో ముస్లిం అబ్బాయి తిరిగితే పట్టించుకోరు. అదే బుర్ఖా వేసుకున్న అమ్మాయి మరొకరితో కనిపిస్తే దాడి చేస్తారు. అమ్మాయి ఎవరిని ఇష్టపడితే మనకేంటి? మగాడికో న్యాయం.. ఆడవాళ్లకో న్యాయమా?’’ అంటూ అసదుద్దీన్ నిలదీశారు. ఇది 1969 కాదని, మనం 2021లో ఉన్నామని, కాలానికి తగ్గట్టుగా మారకతప్పదని అసద్ హితవు పలికారు.