కువైత్‌లో కొత్త నిబంధన..

Published: Friday October 22, 2021

కువైత్‌లో పనిమనుషులుగా అధిక సంఖ్యలో భారత్ నుంచే వెళ్తుంటారు. ఉపాధి కోసం ఇండియా నుంచి వెళ్లే మహిళలు ఎక్కువగా ఇంట్లో పనిమనుషులుగానే చేరుతుంటారు. à°ˆ క్రమంలో కొందరు కేటుగాళ్లు వారిని మోసం చేయడం, పనికి కుదుర్చుకున్న యజమాని కాంట్రాక్ట్ పరిమితి, జీతం విషయంలో మాటమార్చడం వంటివి జరుగుతుంటాయి. దాంతో ఉపాధి కోసం వెళ్లినవారు వేరే దిక్కులేక వారి మోసాన్ని భరిస్తూ అక్కడే ఉండడం జరుగుతుంది. అందుకే ఇకపై డొమెస్టిక్ వర్కర్ల నియామకాల విషయంలో ఇలాంటివి జరగకుండా తాజాగా భారత్, కువైత్‌‌ మధ్య కీలక ఒప్పందం కుదిరిన్నట్లు తెలుస్తోంది. దీనికి à°† దేశ కేబినేట్ కూడా ఆమోదం తెలిపిందని సమాచారం. à°ˆ ఒప్పందం ప్రకారం భారతీయ మహిళలను పనిమనుషులుగా నియమించుకునేందుకు కొన్ని కొత్త నిబంధనలు తెరపైకి వచ్చాయని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.