ఇకపై బీచుల్లో ఆ పని చేస్తే రూ. 12లక్షల ఫైన్
Published: Saturday October 30, 2021

దేశంలోని నివాసితులు, ప్రవాసులకు కువైత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. సముద్రతీర ప్రాంతాలు, బీచులకు వెళ్లే సందర్శకులు నత్తలు, గవ్వలు సేకరించడం నిషేధించబడిందని, ఇకపై ఎవరైన దీన్ని ఉల్లంఘిస్తే రూ.62వేల నుంచి రూ. 12.41లక్షల వరకు జరిమానా ఉంటుందని ఎన్విరాన్‌మెంట్ పబ్లిక్ అథారిటీ హెచ్చరించింది. ఇలా సముద్రపు గవ్వలు, నత్తలను సేకరించడం ద్వారా సముద్ర జీవుల మనుగడ దెబ్బతింటుందని పేర్కొంది. కనుక ఇకపై బీచులు, సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లే ప్రవాసులు, నివాసితులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. లేనిపక్షంలో భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తందని వార్నింగ్ ఇచ్చింది. ప్రధానంగా కువైత్ సముద్ర తీర ప్రాంతాలైన అంజాఫా, అల్ బిడ్డా, ఫింటాస్, అల్ జోన్‌లో ఈ చర్య అధికంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు.

Share this on your social network: