డ్యూటీ వేళల్లో వేరేచోట కనిపిస్తే చర్యలు

Published: Monday November 01, 2021

ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీ్‌సపై ప్రభుత్వం నిఘా పెట్టింది. డ్యూటీ సమయంలో వేరేచోట ప్రాక్టీస్‌ చేస్తూ కనిపిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే.. ప్రస్తుతానికి డ్యూటీ సమయాలకే à°ˆ ఆదేశాలను పరిమితం చేసినా.. భవిష్యత్తులో మొత్తంగానే ప్రైవేటు ప్రాక్టీ్‌సని ప్రభుత్వం రద్దు చేయనున్నదా అనే సందేహాలను సీనియర్‌ వైద్య వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. స్పెషలిస్టుల సేవలు అందరికీ అందాలనే సుప్రీంకోర్టు తీర్పును గుర్తుచేస్తూ... ప్రైవేటు ప్రాక్టీ్‌సను మొత్తంగానే రద్దుచేయడం మంచిది కాదని సూచిస్తున్నాయి. నిజానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజునుంచీ ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీ్‌సపై కన్నేసింది. à°—à°¤ ఏడాదిన్నర నుంచి ప్రైవేటు ప్రాక్టీస్‌ రద్దుపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం à°…à°¡à°—à°¡à°‚... ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరుగుతోంది. తాజాగా à°ˆ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. à°† మేరకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో ఈశాఖ ఉన్నతాధికారులు సమావేశమై... ప్రైవేటు ప్రాక్టీస్‌ చేస్తున్న వైద్యుల సమాచారం తీసుకోవాలని ఆదేశించారు. à°ˆ క్రమంలో జిల్లా కలెక్టర్లు, జేసీలు రంగంలోకి దిగారు. ప్రభుత్వాస్పత్రుల్లో విధులు నిర్వహిస్తూ... ప్రైవేటు ప్రాక్టీస్‌ చేస్తున్న వైద్యుల వివరాల సేకరణ ప్రారంభించారు. జిల్లా వైద్యాధికారులు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్ల ద్వారా వైద్యులకు వ్యక్తిగతంగా లేఖలు పంపుతున్నారు. ‘‘మీరు ప్రస్తుతం నిర్వహిస్తున్న క్లినిక్కులు/నర్సింగ్‌ హోమ్స్‌ లేదా ప్రైవేటు ప్రాక్టీస్‌ చేస్తున్న ఆస్పత్రుల వివరాలను తెలియజేయండి’’ అని à°† లేఖల్లో కోరుతున్నారు. బోధనాసుపత్రుల్లో విభాగాల హెచ్‌వోడీలు, సీఎ్‌సఆర్‌ఎంవోలు, జిల్లా వైద్యాధికారులు వెంటనే దీనిపై సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వాస్పత్రుల అధికారులు సమాచారం సేకరణ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ప్రాక్టీస్‌ చేస్తున్న వైద్యుల డేటాను తెప్పించుకుని... తొలుత వాటిపై పర్యవేక్షణ చేసి.. అనంతరం విచారణ చేసే దిశగా ప్రభుత్వం à°°à°‚à°—à°‚ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ప్రైవేటు ప్రాక్టీస్‌ రద్దు సాధ్యమా..? అన్న ప్రశ్నకు.. అది అసాధ్యమని సీనియర్‌ వైద్యులు వాదిస్తున్నారు. ‘‘à°’à°• స్పెషలిస్ట్‌  సేవలు అందరికి ఉపయోగపడాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం వైద్యులను నియమించుకునే సమయంలో ఇచ్చే నియామక ఉత్తర్వుల్లో ప్రైవేటు ప్రాక్టీస్‌ చేయడానికి వీల్లేదని కచ్చితమైన షరతు పెట్టాలి. లేకుంటే మాత్రం సాయంత్రం డ్యూటీ ముగించుకొన్న తర్వాత డాక్టర్లు ఎక్కడైనా వారి సేవలు అందించవచ్చు. ప్రాక్టీస్‌ రద్దుపై గతంలో ప్రభుత్వ వైద్యుల సంఘం కోర్టులను ఆశ్రయిస్తే... కోర్టు కూడా వైద్యులకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. కాబట్టి, ప్రాక్టీస్‌ రద్దు దాకా ప్రభుత్వం వెళ్లకుండా ఉండటం మంచిది’’ అని సూచిస్తున్నారు. 

నిబంధనల ప్రకారం ప్రభుత్వ వైద్యులు ఉదయం తొమ్మిది à°—à°‚à°Ÿà°² నుంచి సాయంత్రం నాలుగు à°—à°‚à°Ÿà°² వరకూ ఆస్పత్రిలోనే ఉండాలి. à°† తర్వాత ఎక్కడైనా వారు ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. ప్రైవేటుగా తాము ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారన్న సమాచారం ఏటా ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వానికి సమర్పించాలి. à°ˆ మేరకు వారిని ఆరోగ్యశాఖ నిర్దేశించాలి. కానీ, à°—à°¤ కొన్నేళ్లుగా à°ˆ ప్రక్రియనే పక్కన పడేశారు. ప్రైవేటు ప్రాక్టీస్‌ రద్దు అంశం తెరపైకి రావడంతో తాపీగా ఇప్పుడు ఆరోగ్యశాఖ మళ్లీ à°† నిబంధనను పైకి తీసింది. డ్యూటీ సమయంలో వైద్యులు ఆస్పత్రిలో లేకపోతే వాళ్లిచ్చిన సమాచారం ప్రకారం నేరుగా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి అధికారులు తనిఖీ చేయాలన్న à°ˆ నిబంధనను వేగంగా అమల్లోకి తెచ్చింది. తనిఖీల్లో వైద్యులు దొరికితే చర్య తీసుకోవాలనీ ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, చాన్నాళ్లుగా మూలనపడిన à°ˆ నిబంధనను హఠాత్తుగా అమల్లోకి తీసుకురావడం అనుమానాలకు దారితీస్తోంది. దీనిని అడ్డుపెట్టుకుని నెమ్మదిగా ప్రైవేటు ప్రాక్టీస్‌ రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సీనియర్‌ వైద్య వర్గాలు సందేహిస్తున్నాయి. పస్తుతానికి మాత్రం ప్రభుత్వ వైద్యులపై గట్టి నిఘా కొనసాగుతోంది