కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీని పరామర్శించిన చరణ్
ఇటీవలే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. ఇప్పటికీ ఆయన లేరనే విషయాన్ని అభిమానుల గానీ, సినీతారలు గానీ నమ్మలేకపోతున్నారు. దాదాపు 10 లక్షలకు పైగా జనం ఆయన పార్దివ దేహాన్ని చూసేందుకు స్టేడియానికి తరలి వచ్చారంటేనే పునీత్ గొప్పతనమేంటో అర్థమవుతోంది. ఆయనకు టాలీవుడ్ సినీ ప్రముఖులతోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడ హీరోలతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. అందుకే ఆయన మరణ వార్త తెలిసిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, వెంకటేశ్, జూ.ఎన్.టి.ఆర్, శ్రీకాంత్, మోహన్ బాబు సహా పలువురు కంటతడి పెట్టారు. ఇదే క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ హీరో మెగాహీరో రామ్‌చరణ్ కూడా అక్కడికి వెళ్లారు. పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించి.. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా అప్పు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని అన్నారు. తాను కలిసిన వ్యక్తులలో పునీత్ ఓ గొప్ప మనిషని చరణ్ కొనియాడారు.

Share this on your social network: