బాధ్యులైన పోలీసులపై ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకున్నారు?
దళిత మహిళ మరియమ్మ లాక్‌పడెత్ కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంత దారుణంగా కొడితే ఎవరి గుండె అయినా ఆగిపోతుందని వ్యాఖ్యానించింది. కుటుంబసభ్యులకు పరిహారం ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? అని ప్రశ్నించింది. ఘటనకు కారణమైన పోలీసులపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అడ్డగూడూరు పోలీ్‌సస్టేషన్‌లో ఈ ఏడాది జూన్‌లో మరియమ్మ అనే దళిత మహిళ లాక్‌పడెత్‌కు గురైన విషయం తెలిసిందే. కాగా, ఆమె మృతిపై న్యాయవిచారణకు ఆదేశించాలంటూ పీయూసీఎల్.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం, దీనిపై హైకోర్టు న్యాయవిచారణతోపాటు మృతదేహానికి రీపో్‌స్టమార్టం చేయాలని ఆదేశించడం తెలిసిందే. తాజాగా ఈ కేసు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట బుధవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా.. ఘటనకు కారణమైన పోలీసులపై ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకున్నారని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. మరియమ్మ కుమారుడు, కుమార్తెలకు ప్రభుత్వం పరిహారం చెల్లించిందని, ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించిందని తెలపగా.. పరిహారంతో ప్రాణాలు తిరిగి రావని ఘాటుగా వ్యాఖ్యానించింది
మరియమ్మ మృతదేహానికి నిర్వహించిన మొదటి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో పెద్దగా గాయాలున్నట్లు కనిపించడం లేదని, రెండో పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తీవ్రమైన గాయాలైనట్లు తేలిందని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశించాకే రెండోసారి పోస్ట్‌మార్టం జరిగిందని, లేదంటే తీవ్ర గాయాల విషయం బయటకు వచ్చేదికాదని వ్యాఖ్యానించింది. అయితే మరియమ్మ అప్పటికే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అందువల్లే హార్ట్ ఫెయిల్యూర్‌తో చనిపోయారని ఏజీ తెలపగా, ‘ఇంత దారుణంగా కొడితే ఎవరి గుండె అయినా ఆగిపోతుంది’ అని వ్యాఖ్యానించింది. ఇది స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారించదగిన కేసు అని అభిప్రాయపడింది. వచ్చే విచారణకు సీబీఐ ఎస్పీ హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఐని కేసులో ఇంప్లీడ్ చేస్తూ నోటీసులు జారీ చేసింది. మొత్తం ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు అప్పగించాలని ఏజీని ఆదేశించింది. విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
పెద్దపల్లి జిల్లా మంథని పోలీ్‌సస్టేషన్‌లో శీలం రంగయ్య లాక్‌పడెత్‌కు గురయ్యారన్న కేసులో సంబంధిత పోలీసులపై ఏంచర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు బుధవారం డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. శీలం రంగయ్య అనే వ్యక్తిని మంథని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి నాలుగు రోజులపాటు కస్టడీలో ఉంచుకోవడంతో గత ఏడాది మే 26న ఆయన పోలీసుల అదుపులో ఉండగానే చనిపోయారు. శీలం రంగయ్య ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలుపగా.. నాలుగురోజులపాటు తీవ్రంగా చిత్రహింసలకు గురిచేయడంతోనే ఆయన చనిపోయారని ఈ ఏడాది ఫిబ్రవరిలో హత్యకు గురైన న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి ఆరోపించారు. గత ఏడాది హైకోర్టులో వారు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అనంతరం న్యాయవాదులు హత్యకు గురికావడంతో కేసు విచారణకు వీలుగా సీనియర్ న్యాయవాది సి.దామోదర్‌రెడ్డిని హైకోర్టు అమిక్‌సక్యూరీగా నియమించింది. ఈ కేసు బుధవారం మరోసారి చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అమికస్ క్యూరీ దామోదర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. పోలీసుల వైపు నుంచి కొన్ని తప్పులు జరిగినట్లు నివేదికలో ఉన్నదని, నివేదిక అందిన తర్వాత ఏంచర్యలు తీసుకున్నారని ఏజీని ప్రశ్నించింది. డీజీపీ నుంచి వివరాలు తీసుకుని సమర్పిస్తామని ఏజీ తెలిపారు. మూడువారాల సమయం కోరారు. తప్పు చేసిన పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు విచారణను డిసెంబరు 15కు వాయిదా పడింది.

Share this on your social network: