ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరిచండంతో యువతి ఆత్మహత్య

Published: Saturday November 13, 2021

 తూర్పుగోదావరి జిల్లా రాజోలు తుఫాన్ కాలనీలో యువతి కుసుమ శ్రీలత (21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గోగన్నమఠం గ్రామ యువకుడు మనోజ్ ఆత్మహత్యకు కారణంగా  ఆరోపిస్తున్నారు. ప్రేమించిన మనోజ్ పెళ్లికి నిరాకరించడంతో యువతి మనస్తాపానికి గురైంది. పెళ్లికి అంగీకరించమని  అర్ధరాత్రి రెండు గంటల వరకూ  వాట్సాప్‌లో యువతి చాట్ చేసినట్లు తెలుస్తోంది. తాను సీలింగ్‌కు  ఉరికి వేసుకుంటున్న ఫోటోను వాట్సాప్‌లో ప్రియుడుకి పంపింది. ఆత్మహత్యకు సిద్ధమైనా  ప్రియుడు అంగీకారం తెలపకపోవడంతో  సూసైడ్ చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసిన రాజోలు సీఐ దుర్గా శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.