ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా సీపీఐ నేత నారాయణ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఘటనపై వంశీ క్షమాపణలు చెప్పడం స్వాగతించదగ్గ విషయమన్నారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం తీరు అన్యాయం, దురదృష్టకరమన్నారు. కుటుంబ పెద్దగా వ్యవహరించి కంట్రోల్ చేసి ఉండాల్సిందన్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దుఖించకుండా హుందాగా వ్యవహరించాల్సిందని నారాయణ చెప్పుకొచ్చారు. ఏం తప్పుచేశారని 12 మంది సభ్యులను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు..? అని ఈ సందర్భంగా నారాయణ ప్రశ్నించారు. బానిసలా వ్యవహరించకుండా వెంకయ్య నాయుడు వారి సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. రైతు ఉద్యమంలో మరణించిన 750 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నారాయణ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Share this on your social network: