రోశయ్య అంత్యక్రియలు పూర్తి

Published: Sunday December 05, 2021

మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు పూర్తైయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. రోశయ్య అంత్యక్రియలకు ప్రముఖులు హాజరైనారు.  రోశయ్య శనివారం ఉదయం ఆయన కన్నుమూశారు. ఉదయాన్నే 5.30à°•à°¿ నిద్రలేచిన ఆయన.. కాలకృత్యాల అనంతరం మళ్లీ నిద్రపోయారు. సాధారణంగా ఉదయం 7.15à°•à°¿ నిద్రలేస్తారు. 7.30 వరకూ లేవకపోవడంతో.. ఆయన నాడి పరిశీలించిన కుటుంబసభ్యులు వెంటనే బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-10లోని స్టార్‌ ఆస్పత్రికి తరలించారు.  అప్పటికే పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. రోశయ్య పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌లో ఉంచారు. అక్కడి నుంచి దేవరయాంజల్‌లోని వ్యవసాయ క్షేత్రంల  అధికార లాంఛనాలతో రోషయ్య పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. రోశయ్య మృతిపై తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా శనివారం నుంచి సోమవారం దాకా సంతాప దినాలుగా పాటిస్తున్నట్లు తెలిపింది.