ఆత్రేయపురం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ఏసీబీ తనిఖీలు

Published: Tuesday December 07, 2021

 జిల్లాలోని ఆత్రేయపురం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. సబ్‌రిజిస్ట్రార్‌ ప్రసాద్‌పై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని అభియోగాలు వచ్చాయి. దీంతో రాజమండ్రి, కాకినాడ,  హైదరాబాద్‌లోని బంధువుల ఇళ్లతో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేసింది. పలు కీలక పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది.