ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్..

Published: Tuesday December 14, 2021

సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం జారీ చేసిన జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ సినిమా థియేటర్ల యజమానులు హైకోర్టులో పిటీషన్‌ వేశారు. పిటీషనర్ల తరఫున న్యాయవాదులు చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.35ను సస్పెండ్‌ చేసింది. దీంతో ఇక నుంచి రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో పాత రేట్లే అమల్లోకి వస్తాయి.

పవన్ కల్యాణ్ ‘వకీల్‌సాబ్‌’ సినిమా విడుదల సమయం నుంచి టికెట్‌ రేట్ల గురించి ఏపీ ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకు చర్చలు జరుగుతూ ఉన్నాయి. పలుమార్లు ఇదే విషయంపై చర్చించడానికి సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వం చుట్టూ తిరిగారు. ఏపీ మంత్రి పేర్ని నాని à°ˆ విషయంపై పలు సందర్భాల్లో ప్రెస్‌మీట్లు పెట్టి మరీ మాట్లాడారు. రీసెంట్‌à°—à°¾ ఏపీలో సినిమా టికెట్ల ధరలు ఇలానే ఉండాలంటూ.. టికెట్ ధరల పట్టికను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఆన్‌లైన్‌ వ్యవహారంపై సంతృప్తికరంగానే ఉన్న టాలీవుడ్ ప్రముఖులు.. టికెట్ల ధరల విషయంలోనే ఒక్కసారి ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో à°ˆ విషయం కోర్టు వరకు వెళ్లడం జరిగింది. నేడు(మంగళవారం) కోర్టు ఇచ్చిన తీర్పుతో రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాల నిర్మాతలే కాకుండా, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.