అధిక ధరలకు టికెట్లను విక్రయిస్తే కఠిన చర్యలు
Published: Thursday December 23, 2021

జిల్లాలోని థియేటర్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అధిక ధరలకు సినిమా టికెట్లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ హెచ్చిరించారు. థియేటర్లలో టికెట్ ధరల పట్టిక ప్రదర్శించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక ధరలకు టిక్కెట్లను విక్రయించరాదన్నారు. సినిమా థియేటర్లలోని క్యాంటీన్లలో తినుబండారాలను అధిక ధరలకు విక్రయించరాదని ఆయన సూచించారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా సినిమా థియేటర్లలో అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వాహనాల పార్కింగ్‌కు ఎక్కువ ధరలు వసూలు చేయరాదన్నారు. థియేటర్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వినోదం కోసం సినిమా థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Share this on your social network: