రేవంత్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

Published: Monday December 27, 2021

 à°Ÿà±€à°ªà±€à°¸à±€à°¸à±€ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి ఎర్రవల్లికి బయల్దేరుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం నుంచీ రేవంత్ నివాసంతో పాటు పలువురు కాంగ్రెస్ నేతల ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. సోమవారం తెల్లవారుజామునుంచే పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్‌లు చేశారు. అయితే.. మధ్యాహ్నం రెండు గంటలు కావస్తుండటంతో రేవంత్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు.

రేవంత్ బయటకు రాగానే అరెస్ట్ చేసిన పోలీసులు భారీ బందోబస్తుతో తరలించారు. ఈ క్రమంలో పోలీసులు-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచే ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాస్తూ.. ఇంటి నుంచి ఎటు వైపు నుంచి బయటికి వచ్చినా అడ్డుకుని అరెస్ట్ చేయాలని ముందస్తు వ్యూహంతో పోలీసులు ఉన్నారు. ఆయన బయటికి రాగానే అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ను ఎక్కడికి తరలించారన్న విషయం మాత్రం తెలియరాలేదు.