సినీ పరిశ్రమపై జగన్ సంచలన వ్యాఖ్యలు

సినీ పరిశ్రమపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పెద్దలపై పరోక్ష విమర్శలకు దిగారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ‘వైఎస్సార్ పెన్షన్’ కానుక పెంపును జగన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదవాడికి అందుబాటు రేటులో వినోదాన్ని అందించాలని, సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తే.. ఆ నిర్ణయంపై రకరకాలుగా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ఇలాంటి వాళ్లు పేదల గురించి ఆలోచించేవాళ్లేనా అని ప్రశ్నించారు. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తే విమర్శిస్తున్నారని, ఇలాంటి విమర్శలు చేసే వారందరూ పేదలకు శత్రువులేనని జగన్ అన్నారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయంపై టాలీవుడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పలువురు సినిమా పెద్దలు ఇప్పటికే అభ్యంతరాలు తెలిపారు. అంతేకాదు సినిమా టికెట్ల ధరలను గతంలోలాగే ఉంచాలని కోరారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోలేద

Share this on your social network: