ఉత్తరకొరియాలో ఆహార కొరత..

Published: Sunday January 02, 2022

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ అంటే ముందుగా గుర్తొచ్చేది భారీ కాయం.. గుండ్రటి మొహం.. అరగుండు హెయిర్ స్టైల్..! కానీ.. ఇటీవల కాలంలో కిమ్‌లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా..కిమ్ తన శరీరంలో కిలోల లెక్కన పేరుకుపోయిన కొవ్వును వదిలించేసుకుంటున్నారు. à°ˆ క్రమంలో స్లిమ్మైపోయిన కిమ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కానీ.. తాజాగా వైరల్ అవుతున్న ఫొటోలో మాత్రం కిమ్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయన బుగ్గలన్నీ కరిగిపోవడంతో.. అసలు ఈయన ఆయనేనా అనేంతగా ఛేంజైపోయారు. 

 

అనారోగ్యం కారణంగానే ఆయన బరువుతగ్గిపోతున్నారని మొదట్లో పాశ్చాత్యా మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి. కానీ.. ఉత్తరకొరియా మీడియా à°† వార్తలను వెంటనే ఖండించింది. తన ఫిజిక్‌లో మార్పు కోసమే కిమ్ చిక్కిపోయి చూడచక్కనోడుగా మారుతున్నాడని చెప్పుకొచ్చాయి. తాజాగా అక్కడి అధికారులు మరింత ఆశ్చర్యం గొలిపే కారణం చెప్పారు. ఉత్తరకొరియా ఆర్థికసంక్షోభం, ఆహార కొరతతో సతమతమవుతున్న కారణంగా.. ఆయన దేశ ప్రజల కోసం పొదుపు పాటిస్తూ తిండి తగ్గించారని, à°ˆ క్రమంలో మరింత స్లిమ్మైపోయారని తెలిపారు. అంతేకాకుండా.. ఇలా బక్కచిక్కిపోతున్న కిమ్‌ను చూసి  ప్రజల గుండెలు పగిలిపోతున్నాయని కూడా చెప్పుకొచ్చారు. 

 

కారాణాలు ఏమైనప్పటికీ.. కిమ్ ఫొటోలు మాత్రం మరోసారి పెద్ద చర్చకే దారి తీశాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న ఉత్తరకొరియా..ఇటీవల కాలంలో సంభవించిన వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల కారణంగా ఆహారకొరత కూడా ఎదుర్కొంటోంది. ఫలితంగా.. ప్రజలకు కడుపునిండా తినేందుకు ఆహారం దొరక్క అవస్థలు పడుతున్నారట. మరోవైపు.. కిమ్ వంశంలో ఇప్పటికే అనేక మంది గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ఉత్తరకొరియా పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. కిమ్ తరువాత దేశాన్ని ఏలేది ఎవరనేదానిపై క్లారిటీ లేకపోవడంతో కిమ్ అనారోగ్యం పాలైతే పరిస్థితి ఏంటనేది ఓ మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.