నా ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ హరించలేరు

Published: Tuesday January 04, 2022

 "నా  ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ హరించలేరు" అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో  నగరానికి నడ్డా వచ్చారు. ఈ సందర్భంగా  శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న  అనంతరం ఆయన మాట్లాడారు. గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తానన్నారు. పోలీసులు కరోనా ఆంక్షల జీవో ఇచ్చారుని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తానని ఆయన తెలిపారు. నగరంలో నడ్డా  చేపట్టిన ర్యాలీకి ఆంక్షలతో కూడిన అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది. సికింద్రాబాద్‌లోని గాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించేందుకు అనుమతిని పోలీసులు ఇచ్చారు.